HAnother Merry Christmas Arrived!
క్రిస్మస్ మరలా విచ్చేసింది! ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇంత పరమత సహనం ఎన్నడైనా కనిపించిందా? అని చాలా మంది
హైందవ భారతీయులు అనుకుంటూ వుంటారు! తప్పులేదు! నిజమే! అది గర్వకారణమే..కాని ప్రపంచం అంతా గుప్పిటిలోకి
వచ్చి ఎల్లలు అన్నీ కల్లలు ఐపోయాయి ఇప్పుడు..జిల్లా,రాష్త్రం (State),దేశం,ఖండం....ఈ భేదాలను లెక్క చేయ కుండా ఎంతమంది
ప్రపంచవ్యాప్తంగా హైందవ భారతీయులు ప్రపంచం అంతా తమ పొట్ట చేత పట్టుకుని వెళ్లి, ఇస్లామిక్ దేశాలలో,క్రిస్టియన్ దేశాలలో తమ జీవికను కొనసాగించటం లేదు? అక్కడ మన దేవాలయాలను కట్టుకుని మన మతానికి ,ధర్మానికి చెందిన కార్యక్రమాలు నిర్వహించడంలేదు? మడికట్టుకుని, గిరిగీసుకుని, ఏకాకులుగా బ్రతకడం వల్లనే భారతీయులు తమ గొప్పదనాన్ని ఇతరులకు తెలియ జెప్పలేక, ఇతరుల గొప్పదన్నాన్ని తాము గ్రహించ లేక అంధులుగా తయారై, తేలికగా ఇతరులకు లొంగి పోయి దాదాపుగా
పన్నెండు వందల సంవత్సరాలు దాస్యం చేసారు, ఇతర మతాలకు చెందిన పాలకులకు..కనుక మనమూ వ్యాపించాలి, మన జ్ఞానమూ వ్యాపించాలి , ఇతరులు మనను సహించాలి అంటే...మనము ఇతరులను సహించాలి..ఇది భారతీయులకు క్రొత్త కాదు..
ఇతరులను సహించడం అంటే మనను మనం మరిచి పోవడం కాదు! మన ఇంటికి అతిధులు వచ్చినపుడో,లేక మనం ఇతరుల ఇళ్ళకు అతిధులుగా వెళ్లినపుడో ఎలాగైతే మనను మనం కాపాడుకొంటూ, కలసి పోతామో అలాగే..
ఈ ప్రపంచం లోకి అతిధులుగా వచ్చిన మనం మన మర్యాదను,ఇతరుల
మర్యాదను కాపాడి వచ్చిన చోటుకి వెళ్లి పోదాము
సహనానికీ,సామర్ధ్యానికి మధ్యన వున్న సన్నని 'రేఖను' తెలుసుకుందాము!
ఒక చెంప మీద కొడితే ఇంకో చూపించడం అవసరం లేదు..చెంప మీద కొట్టించుకొనే పరిస్థితి తెచ్చుకోవద్దు!!! చెంపలు పగుల కొట్టడమే పనిగా తిరిగేవాడికి గూబలు గుయ్యు మనేలా చేయడము మానవద్దు!!
క్రిస్టియన్ సోదరులందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబ్దాము!!
కృష్ణుడిని గుండె గుడులలో కొలుచుకున్దాము!!
Happy and Merry Christmas to Christian Brothers!
सब भाईयोंको शुभ kaamnaayen
No comments:
Post a Comment