శ్రీ రాజ రాజేశ్వరా! వేములవాడ పురాధీశ్వరా!
నీ చరణములే మాకు శరణములు
నీ స్మరణములే భవ తరణములు
రాజీవాక్ష రాజేశ్వరీ ప్రణయ పీఠేశ్వరా!అమృత మాహేశ్వరా!||శ్రీ||

నీ దర్శనమే పాప భంజనం
నీ భక్తులకే హృదయ రంజనం
దయగనరా భవభయములు బాప హరిహర రూపా గిరివర చాపా
జగదీశ్వరా గిరిజహృదయేశ్వరా అర్ధనారీశ్వరా రుద్ర పరమేశ్వరా ||శ్రీ||

దివిజాధిపతిని , వాణీపతిని
సిరికాంతుడిని , ఏకాంతుడిని
ఎల్లరినొకటిగ కరుణింతువయా కరుణాశంకర,భోళా శంకర
హరహర శంకర అఘనాశంకర పరమశుభంకర భక్త కింకర ||శ్రీ||

ప్రథమ మిధునమౌ ఆదిదంపతులు
మీ గానములే నిజము సంపదలు
కైలాసపురి వాస కల్మష నాశా!అహివర భూషా!ఇహ పర శాసా!
యోగేశ్వరా, యోగి హృదయేశ్వరా,యోగ మాయేశ్వరా,ధర్మకుండేశ్వరా ! ||శ్రీ||

No comments:
Post a Comment