పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, February 6, 2012


నాటకం!


బతుకొక ఘటన బతుకొక నటన
వీక్షణ నీది నిరీక్షణ నీది
దర్శకు డతను ప్రదర్శన నీది!

పాత్ర పరిధిలో నువు జీవించు
జీవిత పాత్రను పరిపోషించు
ఎత్తే దొక తెర దించే నొక తెర
నడుమ నాటకం జీవితమను చెర
ఈ చెరసాల, ప్రదర్శన శాల
రమ్యమైన ఒక రంగశాలరా
ఎపుడో మొదలై ఇప్పటి వరకూ
ఎప్పటివరకో సాగు ఖేలరా!
శిక్ష ముగియునొక పరి ఇది సత్యం!
రంగు మార్చునొక నటుడది తధ్యం!
మూటా ముళ్ళే నెత్తి కెత్తుకొని
దుస్తులు వస్తువు గంప సర్దుకొని
ఇంకో ఆటకు నటుడా సిద్ధం
కావోయీ, రంగం సన్నద్ధం!

No comments:

Post a Comment