పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, February 6, 2012


రుచులు..ఋతువులు!

వయసు కవిత్వం వలపు వసంతం
ఆపై తలపులు ప్రచండ గ్రీష్మం
శోకం హర్షం ఋతువై వర్షం

సోకిన అనుభవ శరచ్చంద్రికలు
స్వాంతం శాంతం ఇక హేమంతం!
శిధిలం జీవనమిక గతి శిశిరం!
జీవన గమ్యం,కవి కథ రమ్యం
ఆరు ఋతువులై ఆరు రుచులతో
అలరే,అడరే,ముసురై మురిసే
బతుకు కవిత్వం కవిత్వ జీవిక!
కవిత్వమంటే ఒక పరిశీలన
కవిత్వమంటే ఒక అనుశీలన
కవుల పాటకూ బతుకు బాటకూ
మారును ఋతువులు,రుచులభిరుచులు!!

No comments:

Post a Comment