పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, March 11, 2012



నాలో నేను!..


నాకొక పేరది మధువ్రతం
సరసపు కవితల పలుకులే వ్రతం
భూతం భవితం గతమిక విగతం
శోకం నాకం నాలో స్వగతం
ఖేదం మోదం ఖేలగ కమతం
పంటేమైనా పొలం జీవితం
వొంటరిగా నా కలం కాగితం!
నాలో వేవేల విషాద సాగరాలున్నై
ఏలో..వేలో..కావేరుల కదలికలున్నై
మేలో..ఇది ఏలో..ఇట అశ్రుల మాలా తోరణములు!
ఔ నూ కాదనుకుంటూ ఆశ నిరాశలతో రణములు!
యమునా. నయమున నా ఎద లోతుల చీకటి
గోదావరి ఘోషలతో యోష అదే ఎద మీటుచు నేటికి!!
విషాద ఝరులవి గొప్పలట
ముసురులు ముత్తెపు చిప్పలట
అందంగా ఓదారిస్తే.. పయనానికి.. ఓ.. దారిస్తే
శోకంలో అందం ఉంది..పయనంలో బంధం ఉంది!
ఎందుకు కాము మనం బంధువులం?
కవన బిందు సింధువులం!
కవితా లత పర్ణముపై తొలి తుషార బిందువులం!
కలల కడలి ఘోషలం కవుల నాద యోషలం!
కనబడకుండా కదిలే ఎద పలుకుల భాషలం!
అందరి కొకటిగ పంట పండునా??
కనులన్నింటా కలలు పండునా??
కృషీవలునివలె ఈ వ్యవసాయం
ఫలసాయం నా కలసాయం!
ఏముందట ఇంతటికర్ధం?
వొంటరి తనమైతే వ్యర్ధం
జీవిత మది జీవన వ్యర్ధం!!
పదిమందికి అది పరమార్ధం
పవిత్రమంటే లేనిది స్వార్ధం!
పంచుట కొరకే నీ కుంచుట
పరమాత్ముడు నిన్ననుగ్రహించుట
పలుకుల కులుకుల రస కళలో
గానామృత గంగా ఝరులో
ప్రవహించేయ్ ప్రపంచమంతా
రహి మించెయ్ రవంత కొంత
వలదిక ఏ వంతల సంత
మనసుంటే వలపుల పుంత
జగమంతా జాగృతమంతా!
మనసుంటే మార్గం వింతా? 
--
Vara Prasad!

No comments:

Post a Comment