భారతి - హారతి
శ్రీ నిధీ,యశోనిధీ, స్వతంత్ర స్వర్ణ భారతీ!
విషాదమే సశేషమై జ్వలించు అశ్రు హారతి!
వివర్ణమా,వికీర్ణమా,విశీర్ణ జీర్ణ పర్ణమా!
విచీర్ణమా!విషాద నీల లోచనా విఘూర్ణమా!
స్వతంత్రమా?కుతంత్రమా?మతి భ్రమించు మంత్రమా?
పాపమా?విలాపమా!విపణి గొన్న శాపమా?
మా రాతలే విధాతలై,జనత భావి త్రాతలై,
నేతలై,విఘాతలై,భవిత గూల్చు చేతలై,
మాకడ నీడలు నడుస్తున్నై,మాకిట పీడలు గడుస్తున్నై,
మానవ రక్తం రుచి మరిగిన పులి పంజా జాడలు తెలుస్తున్నై,
మందిర కుడ్యం,మశీదు గోడ,మమతల కోవెల,మానవతాలత
తడిసిన మానవ రక్తపు జాడలు మెరుస్తున్నై!
మా కడ నీడలు నడుస్తున్నై!మాకిట పీడలు గడుస్తున్నై!
మనుషులందరూ ఒకటి కాదా?మానవత్వం నిజం కాదా?

మనిషి బతుకు నిత్యం కాదోయ్ మానవత్వమే సత్యమోయ్!
అమ్మా భారత మాతా!దశ దిశాంత చిర విఖ్యాతా!
నా డెందము కుందిల జేసే ఈ వంతలు బాపవె అమ్మా!
రాముదో,రహీముదో,దయాన్తరంగుదో ..
శాంతి కాముదీ ధరణియై రహించు స్వర్గ ధామమై!
శ్రీనిధీ,యశోనిధీ,స్వతంత్ర స్వర్ణ భారతీ!
యుగానికీ, జగానికీ ప్రశాంత ప్రేమ హారతీ!

No comments:
Post a Comment