పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, August 14, 2011


వైద్యో నారాయణ హరి.. 

నడిచే నారాయణుడు, ప్రాణి  సేవ పరాయణుడు
వైద్యో నారాయణ హరి, వైద్య వృత్తి కేది సరి ?
దివ్యగీత, శాంతిదూత, ప్రాణదాత వైద్యుడు
కనిపించే, కరుణించే దేవుడురా వైద్యుడు
ప్రాణాలను పోసి, నిలిపి దీవించే దివ్యుడు
వైద్యుడంటే ఇలలో నడయాడే   దేవుడు......
కనిపించని బ్రహ్మకన్న  కని పెంచే అమ్మకన్న
కడుపులోని శిశువుకు వినిపించే తొలి పలుకు కన్న
ఘనమైనది తన  వృత్తి  పవిత్రమైన దా   ప్రవృత్తి
నిఖిల  వేద వేద్యుడైన శ్రీ హరి సరి! వైద్యుడు  !!.........
అమ్మకు వినిపించనిది, ఆలికి కనిపించనిది
నాన్నకు  విడమర్చనిది, మగనికెరుక పర్చనిది 
ఏదున్నా లేదన్నా   తనకు విశద పర్చనిది 
తనతో లేదే మర్మం నిగమ గంగ తన  ధర్మం......
అసహ్యించుకోని అమ్మ ,ఆశనిలుపు నడుపు నాన్న
మన  క్షేమం కోరే స్నేహితుడై మన  హిత రతుడై
అమ్మకన్న ఆలికన్న నాన్నకన్న మగనికన్న
మిన్నగదరి  జేర్చుకొన్న  ఆదరించు పెద్దన్న......
వైద్యులార, ప్రాణదాన ప్రణవవిద్య కాద్యులార!
వైద్య రాజ నమోస్తు తే యమరాజ సహోదరా
యముడు దోచు ప్రాణములే మీరో ధన మానములూ
ప్రాణములూ దోచుకొనే బందిపోట్లు కాకండి!!........ 
తల రాతలు మార్చ కండి విలువలు  దిగజార్చకండి
కసాయిలై దోచి  మొసలి   కన్నీళ్లను  కార్చకండి 
చావుపుట్టుకలలో మర్మం పేకలు పడుగులే 
మీకైనా మాకైనా మిగిలేదారడుగులే............
గుండె గుడుల  దేవుళ్ళూ గుది బండలు  కాకండి
కూడు గూడు గుడ్డ లేని వారి వెతలు మరవకండి 
వారికుంది బ్రతుకు  హక్కు వారూ మీ  బాధ్యత
సాటి మనిషి  సౌఖ్యంకై సాయ పడుటె  సభ్యత...
మానవతకు కొరత వేసి సిగ్గెగ్గుల శిలువ వేసి
రోగంకన్నా భారంగా రోగికి మారకండి
జలగలనే మించకండి చివరికి తల దించ కండి  
అమ్మలాగ అనురాగపు చిహ్నాలై నిలిచిపొండి!!!..........
అనవసరంగా   కడుపులు కోయకండి ...  ఆపండి
శవాలతో   వ్యాపారం ,పేదకు  నిర్వ్యాపారం 
పీనుగులకు  వైద్యాలు ,వేదన వాయిద్యాలు,అపుడే ఇక సాధ్యాలు  
మనసుల మాగాణులలో మమతలనే సేద్యాలు!!!

No comments:

Post a Comment