పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, August 14, 2011



పరమవీర చక్రం!

భరత మాత వీర సుతుల బతుకు బాటల క్రమం
భారతీయ మహిళల ఘన పతుల సుతుల  పరాక్రమం
ధర్మ రక్షణకు తరలిన దామోదర చక్రం
కర్మ వీరుడౌ సిపాయి ధరియించే చక్రం
పరమ వీర చక్రం! పరమ  వీర చక్రం!
  
ప్రచండ విక్రమార్జితం, అఖండ త్యాగ స్వార్జితం
తమ  జన ధన మాన  ప్రాణ అనురాగ వివర్జితం  
అనితర మౌ శౌర్య ధైర్య ఫలితమై అవక్రం
మనకోసం మరణించిన వారి చరిత సమగ్రం
పరమ వీర  చక్రం! పరమ వీర చక్రం!

మన కొరకై తమ కదనం, తమ కొరకై ఈ కథనం,
పొలికలనిక తమ సదనం, కదన కడలిలో మథనం,
అమృతం మనకిడుట కొరకు, అశ్రులు తమ వారి కొరకు,
అంజలితో  అంకితమిది వారి ఆత్మ శాంతి కొరకు
పరమ వీర చక్రం! పరమ వీర చక్రం!

తమ వేదం మన మోదం, మనకు విందు వినోదం,
మన వెలుగుల కొరకు చితులు, తమకై విలపించు సతులు,
మనవారికి  దీపావళి, వారివారు  శోకావళి!
నిండు మనసుతో వారికిదే నిజాయితీ నివాళి!
పరమ వీర చక్రం! పరమ వీర చక్రం!

తెలుగు తమిళ మలయాళీ ఒరియ కన్నడ  గుజరాతీ
మధ్య ప్రదేశ్, మహా రాష్త్ర, బెంగాలీ, పంజాబీ,
హిందూ,ముస్లిం,క్రైస్తవ,సిక్ఖు జాతి కానిదీ,
ఏ భేదం లేని భారతీయ వీర జవానుదీ 
పరమ వీర చక్రం! పరమ వీర చక్రం!

No comments:

Post a Comment