
వివేక శంకరం.
వివేక శంకరం.. వివేక శంకరం!!
ప్రణామ్యహం పరాశరాత్మజం జ్ఞాన భాస్కరం నమోస్తు ఆదిశంకరం సమస్త లోక శంకరం
జయోస్తు తే వివేకినం విశిష్ట విశ్వ లోకినం
స్మరామి జ్ఞాన,భక్తి,త్యాగ మార్గ తత్త్వ దర్శినం
వివేక శంకరం..వివేక శంకరం!!
వేద వ్యాస జ్ఞాన మార్గ వాహినీ సరస్వతీ
ఆది శంకరాఖ్య భక్తి మార్గమౌ పవిత్ర గంగవివేక త్యాగ వాహినీ విశిష్ట యమున సంగమంగ
సోదరా! త్రివేణి.. సోదరీ! వినండి భరత వాణి
వివేక శంకరం..వివేక శంకరం!
భారతీయమైన వేద మార్గ ధర్మ మర్మదం
మానవీయమై పునాది సర్వ కర్మ శర్మదం
మాననీయమై మనేది మమత ధ్యేయమై చనేది
మన ధ్యేయం ఈ వసుధే కుటుంబ మొకటనేది
వివేక శంకరం..వివేక శంకరం!!
శివంకరం, శుభంకరం, సమానతా లతాంకురం
సుభావిదం, సుఖప్రదం,సురత్త్వ మార్గ తత్త్వదం,
వందనీయమైన హైందవీయ ధర్మ దర్శనం
అందమైన సర్వ విశ్వ నిత్య సత్య స్పర్శనం
వివేక శంకరం..వివేక శంకరం!!
No comments:
Post a Comment