శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రేనమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
సీ. తొలగెను ధూమకేతు క్షోభ జనులకు
నతివృష్టి దోషభయంబు వాసె
గంటకాగమభీతి గడచె, నుద్ధత భూమి
భ్రుత్కటకంబెల్ల నెత్తువడియె
మాసె నఘస్ఫూర్తి మరుభూములందును
నెల మూడువానలు నిండ గురిసె,
నాబాల గోపాల మఖిల సద్వ్రజమును
నానందమున మన్కి నతిశయిల్లె
తే. ప్రజలకెల్లను గడు రామరాజ్య మయ్యె
జారు సత్త్వాడ్య! ఈశ్వర నారసింహ
భూవిభుని కృష్ణరాయ! యభ్యుదయమొంది
పెంపుతో నీవు ధాత్రి బాలింపగాను
No comments:
Post a Comment