' బండి '
టక్కరోడి బండి దీని తమాషా జూడండి
ఎంతెంత దూరం కోసెడు కోసెడు దూరం
ఇంకెంత దూరం ఇంకో కోసు దూరం
గండ గొండి మొండిబుద్ధి బండి దోలునండి
బండి నెక్కి మొక్కి బాటసారి సాగునండి
బండి దోలువాడు జగమొండి 'బుద్ధి' దేవుడు
బండినెక్కువాడు వాడి అండ జిక్కు జీవుడు
ఏమిటింత దూరం ఏమిటింత భారం
ఏమి వింత పుంత లింత వేదభావ సారం
టిక్కు టక్కు టిక్కు టక్కు తింగరి బండి
తిప్పులాడి బండి దీని తీరు జూడ రండి!
దేహమంట వింతబండి లాగుచుండు నుంటవండి
తొమ్మిదిన్నొక్కటంట సంఖ్య లోన తిక్కవంట
ఇంద్రియాల దశక మంట గుర్రాలవి కళ్ళెమంట
మనసు ఇక్కడక్క డాగి నక్కి నక్కి చిక్కకుండ
ఎప్పుడెప్పుడెక్కడెక్క డెట్లు సాగుచుండునో
ఎవరి పయన మర్ధవంతమౌచు సాగుచుండునో
అందమైన పయనమంత లోనె ఆగుచుండునో
ఎవ్వరంట తెలిసినోడు? వెలుతురింట వెలిసినోడు!
No comments:
Post a Comment