పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, November 23, 2011


సుతారి!

ఎంత వింత రా భవనము నీది
ఏడే డంత స్తుల ' కళ ' నీది!
పై పై కెదిగిన వవి ఒక ఏడు
పాతాళమునందొదిగిన వేడు!!...

పలుకుల సతి పతి పరమ 'సుతారి'
ఉచ్చ నీచముల నిచ్చెన దారి
పుణ్య మూర్తులకు పై పై ఏడు
పాతాళము లో పాపులకేడు...

చతుర్వేదములు చతుర కంభములు
నాల్గు కుడ్యములు పురుషార్ధములు
అంతర్వీక్షణ లౌ గవాక్షములు
సింహాలోకన సింహద్వారము!...

దన్నుగ పున్నెము మిన్నగు సున్నము
మిడిసిపాటులౌ పాపములడుసు
కల్లలు తెలియని ఉల్లము బెల్లము
డంగు నడిపితివి నంగనాచివై...

ఎన్నంతస్తులు పై పై నున్నా
నేలమాళిగలు మరి ఎన్నున్నా
ఎప్పటికీ నివసించే నెవ్వడు??
శూన్య గేహములు జాలిగ నవ్వెడు!...

అంతరంగమున బహిరంగమున
ఒకటే తేజము ఒకటే నైజము
ప్రజ్జ్వలించునను ప్రజ్ఞ మెరిసిన
విజ్ఞుడు దాటును గేహము దేహము!...



No comments:

Post a Comment