పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Thursday, November 10, 2011



నా విందు!






చక్కనైన చక్కిలాలు నా నెచ్చెలి చెక్కిళ్ళు

మిరపకాయ బజ్జీతో ముచ్చటైన ఎక్కిళ్ళు

ఆ కారం తన గారం నాకే తన సింగారం 

ఆ చిరుచిరు రుసరుసలు వలపుల మధు బుసబుసలు

ఊరించే గవ్వలు మురిపించే తన మువ్వలు
లడ్డూ..తిట్టొద్దు నన్ను..నా చెలి లోతైన బొడ్డు
నాపై తన చాడీలు నాచిరు చేగోడీలు 
మెలికల కారప్పూస సరసపు సఖి వెన్ను పూస
కర కర మను అప్పడాలు తన చుట్టూ తిప్పడాలు
ఊరిస్తూ ఊరిస్తూ ఊహల ముడి విప్పడాలు
యింతి కలువ కనుల వింత కాంతులు నా జంతికలు
రస గుల్లా రస ఖిల్లా నాకై పుట్టిన పిల్ల! 
తన పొందు నా విందు ఇంకా ఏమందు ముందు?
అచ్చరలు వియచ్చరలూ దిగ దుడుపే తన ముందు!







No comments:

Post a Comment