' పిట్టలు '
వూరిలోన ఊర చెరువు
గట్టు మీద రావి చెట్టు
చెరిసగమై వేపచెట్టు
చెట్టు కొమ్మ మీద పిట్ట
పక్కన ఇంకొక్క పిట్ట
గుబురాకుల కొమ్మన ఉండే
కబురులాడు పిట్టలు రెండే
అంటుంది వింటుంది కంటుంది ఒక పిట్ట
అనకుండా వినకుండా కనకుండా ఇంకొక పిట్ట
పిట్ట ఒకటి ఏడుస్తుంది ఒక పరి సంతోషిస్తుంది
మరొకటేమొ ఏడవ కుండా నవ్వ కుండ గమనిస్తుంది
అనుభవించు నొక్కటి దానిని ప్రసాదించు నొక్కటి
ఐనా గమనించ రండి ఆ రెండూ ఒకటే నండీ
పిట్ట ఒకటి బింబమౌను ఒకటౌ ప్రతి బింబము!
No comments:
Post a Comment