పిజ్జకాయలు!!
Welcome to My Blog friends!
Wednesday, October 26, 2011
Sunday, October 23, 2011
నవలోకం

నా హృది మృదు మధురోహల కలల కడలి వీచికలను
అణువణువున శృతి జేసిన ఆనందపు రాగాలను
మోహనముగ వినిపించే మోహన రాగాల నడుమ
అలదుకోని అణువణువున సుమ సుగంధ వసంతాలు
ఎగసి ఎగసి పడుతోంది,ఎగసి ఎగసి పడుతోంది
స్వప్న మధుర రమ్య హర్మ్య నిలయమైన నవలోకం!
అచటి గాలి అనురాగపు సుమ సుగంధ రస భరితం
అచటి తరులు గిరులు నదులు అన్యోన్యపు జీవనమున కత్యద్భుత తార్కాణం!
ఆ దివిలో కార్పణ్యం కల్మషాలు లేని మధురమగు మనసుల సంయోగం
తలపించును వికసిత మధు మధురోహల సుమ కుంజం!
ఆ పుష్పపు సౌరభాలనానే మధుపములమై
సమ భావపు అనురాగపు ఝంఝమ్మను నాదంతో
మమకారపు మధురోహల రెక్కలల్లనల్లనెగిరి
కనుగొందాం చిరుమమతల లతా జనిత అరవిందం
చవిగొందాం మానవ సమ భావన సుమ మకరందం!
మనసు నేల చదును జేసి, మమత తేట నీరు పోసి
పరీరములు పరిఢవిల్ల పర్యంతపు భూమినెల్ల
మొలకెత్తిన చిరు లతలే అలరారెను వృక్షములై
పులకెత్తిన చిరు మమతలె వీక్షించెను సాక్ష్యములై
రా నేస్తం! కుటిలలోక కార్పణ్యపు బంధనాలు
చేయి చేయి కలిపి మనం నేటి తోటి తెంపేద్దాం!
ఇంతవరకు నిన్ను నన్ను విడదీశిన గిరి గీశిన
వికృత దుష్టశక్తుల సమవర్తి కడకు పంపేద్దాం!
చేయి చేయి కలిపి చేరి రుచి చూద్దాం ఆ ఫలాలు!
సమ భావన అమర గీతి శృతి చేద్దాం మన గళాలు!
అరుదెంచిన ఈ యుగాది వేయ వలయు పునాది
మన కలల జగాన వెలుగు రమ్య భావి హర్మ్యానికి!
చేయి చేయి కలిపి మనం సాగి పోవు గమ్యానికి!
ప్రభవా! భవ ఫాలనేత్ర జనిత జ్వాలకీలికవై
దహియింపుము మా లోపలి మత్సరమను కంటకములు!
కరిగింపుము బండబారు మా గుండెలు కఠిన శిలలు!
మసిబారిన మా మనసుల కదలాడే ప్రేమ జ్యోతి
మమత తైలమందజేసి ప్రజ్జ్వలమొనరింపవోయ్
సమత ప్రమిద మాకొసగి ఉజ్జ్వలమొనరింపవోయ్!
(ప్రభవ నామ సంవత్సర ఉగాది 1987 సందర్భంగా వ్రాసింది...)
Saturday, October 22, 2011
విశాల విశ్వం నా ఇల్లు..
విశాల విశ్వం నా ఇల్లు!
విరియును మమతల హరి విల్లు!
రాదిక ఖేదం,కాదిక వాదం,
లేదిక తర తమ వర్గ విభేదం!
లేదిక తర తమ వర్గ విభేదం!
గతించిపోయిన వైభవాలను
హరించి పోయిన కేదారాలను
తలంచుకుంటూ ,స్మరించుకొంటూ,
తలొంచుకొంటూ,భరించుకొంటూ,
రగిలే పొగిలే సమయం కాదిది!
రగిలే పొగిలే సమయం కాదిది!
గతం హయానికి కళ్ళెం వేసి
సవాలు చేద్దాం,సవారి చేద్దాం!
భావి భయానికి బల్లెం దూసి,
అన్ని దిక్కులా మనం చరిద్దాం!
సర్వ శత్రువుల మనం హరిద్దాం!
సర్వ ప్రపంచం విస్మయ విచలిత
ముకుళిత హస్తాల్ అంజలింపగా!
నయన వినిర్గత జ్వాల కీలికల
భారతి హాసం ప్రజ్జ్వలింపగా
విశాల విశ్వ విపంచిపైన ఇక
మమతల తంత్రులు మీటేద్దాం!
సమతల సంధులు చాటిద్దాం!
నువ్వూ,నేనూ,ఆమె..'మనమై'
పువ్వూ,తేనే,ప్రేమల వనమై,
కదలి సాగుదాం కదం తొక్కుతూ!
కలిసి సాగుదాం పదం పాడుతూ!!
(రచనా కాలం 1987...)
(రచనా కాలం 1987...)
Thursday, October 20, 2011
Wednesday, October 19, 2011
Tuesday, October 18, 2011
Monday, October 17, 2011
Sunday, October 16, 2011
సత్యం శివం సుందరం
ఒకటే సత్యం, ఒకటే నిత్యం, ఒకటే సుందరమందరికీ!
అంతా ఒకటను అందమైన నిజమెరుక పడినదది ఎందరికి?
అందరికీ శుభ, మందరికీ శివ, మందరి కౌనది శంకరము
కొందరికే ఇది బోధ పడినచో భువిపై బతుకు భయంకరము!
సాంబశివా యని రామ! కృష్ణ! యని సాగిల బడుదురు కొందరు
అల్లా యని బిస్మిల్లా యని భువి మోకరిల్లెదరు కొందరు!
కరుణా మయుడని, మేరి తనయుడని స్తుతులు చేతురింకొందరు!
ఇద్ధ చరితుడని బుద్ధ దేవుడని బుద్ధి గణింతురు కొందరు!
అమ్మాయని లలితమ్మాయని,దయ మీరమ్మా ఓ మేరమ్మా యని
అమ్మల గొలుతురు కొందరు, అమ్మ తనయులే అందరూ!
అందరి అమ్మలు అమ్మలే!అనురాగ విరుల కొమ్మలే!
అమ్మవంటిదే ప్రతి మతమూ, అనురాగభరిత మభిమతము!
నీ తల్లి వంటిదే ప్రతి తల్లి, మతమన మమతల మరు మల్లి!
తల్లి వంటిదీ ధరా తలం, మత మవరాదొక విషానలం!
నీతల్లిని నువు నిజముగ ప్రేమిస్తే, అమ్మ తత్త్వమును అసలుగ జూస్తే
అవని నెందుకీ అల్లరి? అంతా మమతల వల్లరి!
నీరని యన్నా, 'పానీ' యన్నా, 'వాటర్' అన్నా, తాగిన.. అన్నా!
దాహము తీరుట తథ్యము తత్త్వ చింత'నే'పథ్యము!
దయ కలిగించని దేవుని బాట, దాహం తీర్చని నీరను మాట
పూలు లేని ఒక పూదోట !ఊసర క్షేత్రపు దేవూట?
జాలి వహించని దేజాతైనా , ఇతరుల కొరకను ఏ నీతైనా
నశించి పోవుట తప్పదు!కాలమసత్యము చెప్పదు!
మమతను పెంచని మతమేదైనా, గుణము నశించిన కులమేదైనా
కూలిపోవుటది అవశ్యము,కర్మఫలితమీ రహస్యము!
సమతా శాంతుల బడులు గుడులుగా, మమతల రశీదు మశీదుగా
స్నేహ నేత్రముగ చర్చి చెమర్చి, గురుద్వారాలిక సుఖద్వారాలై
అనంత సత్యము లవిష్కరిద్దాం!! అసలు సమస్యలు పరిష్కరిద్దాం!!
ధరలో శాంతిని పంచుదాం!! భువిని భావికై ఉంచుదాం!!

సత్యం!
ఎవరూ విననిది,అన్నీ వినునది
ఎవరూ కననిది,అన్నీ కనునది
ఎవరనరానిది,అన్నిటి ననునది
ఎవ్వరికైనా స్పృశింపరానిది,నశించి పోనిది
వాసము లేనిది,'వాసన' లేనిది,
అన్నిట 'తానై',అన్నిట 'నేనై',
శూన్యపు మేనై,మాయల జాణౌ
నదే భవిష్యం ,అదే రహస్యం
వర్తమానమది,గతమయ్యదియే
తీసివేతలో తీసిపోనిది,వడపోతలలో తేలిపోనిది,
ఏకతమున ఏకాంత సీమలకు
తరలువారిటకు మరలిరాని
ఘన సన్నిధానమది, పెన్నిధానమది!
గంతా, మంతా, అంతా తానై,
కర్తా, భర్తా, హర్తా తానై
నర్తన, మాయల వర్తన జేసే
వేద నాదమది, విధి విధానమిది!
దానికి లేదే కులమూ, మతమూ!
కాదే జాతీ అహితము, హితమూ!
ఆతండొకడే సత్యుడు, ఎరిగిన వాడే నిత్యుడు!

Friday, October 14, 2011
Thursday, October 13, 2011
Wednesday, October 12, 2011
వేములవాడ
వల్లుబండ లింగా హర హర మహాదేవ జంగా
వదలబోము లింగా నిను విడి కదల బోము జంగా ||
చండికేశ లింగా గండర గండ మొండి లింగా
ధర్మకుండమందు మునిగి ధర్మరాజ లింగా
గండ దీపమందు నిండుగ నూనె బోసినాము
గండము గట్టెక్కించి మెండుగా ఉండర నువు మాకండ దండగా ||
చిందులాడు లింగా శిరసున గంగ పొరలి పొంగ
కోడె గట్టినాము వల్లు బండ బట్టినాము
కోరి చేరినాము సత్తువ కొద్ది కొలచినాము
కోడెనాగు పూమాలను వేసిన కోరి కోరి విషమును తాగేసిన ||
వేములాడ లింగా వేడెద మయ్య పరవశంగా
వేగారార లింగా వేదన బాప రార లింగా
నల్ల కలువ లింగా వుల్లము ఝల్లు ఝల్లనంగా
కల్ల కపటముల నెరుగని వారిని కావ రార కరుణాంతరంగ ఓ ||
రాజ రాజ లింగా రాజేశ్వరికి ప్రాణ లింగా
రామ భక్త లింగా రాముడు కొలిచినాడనంగా
మేము కొలుచుటెంత పూర్వపు పున్నెమెంతొ కొంత
ఇంత లింతలై చెంత జేరితిమి అబ్బురంగ మా ఉబ్బు లింగ ఓ||
వేములవాడ
అఖిల దేవతల నిలయం అడుగడుగున ఆలయం
ఆధ్యాత్మికతకు నిలయం వేములవాడ
వేదాంతుల వేగుచుక్క వేములవాడ
దాంతుల ఏకాంతుల స్వాంతాలకు ఇది నీడ ||
రాజేశ్వర తరంగిణి ధర్మకుండ పుష్కరిణి
రాజతీర్ధమైన దిదే సురగంగా తరంగిణి
ఇచట స్నానమాచరించి అర్ఘ్యములను సమర్పించి
ధర్మ రూపమైన వృషభ వాహనమర్పింతు రిచట||
దక్షిణాన దక్షయజ్ఞ నాశి వీరభద్రుని,
దర్శించెదరా చెంతనె రంగుమీరు లింగ కోటి
సేవించెదరా పొంతనె శేషశాయి విఠలుని
చేతురు ప్రార్ధన నియతిని చండీశుని అనుమతిని ||
లక్ష్మీ గణపతిని జూసి నందీశ్వర సేవ జేసి
శృంగ మధ్యమందు దృష్టి నిలిపి లింగరూపు జూసి
కొలుతురు రాజేశ్వరుని పంచమి రాజేశ్వరిని
మూడు మొనల జోదువుని మూలపు ముత్తైదువుని ||
ఆది దేవుడైన ఆ అనంత పద్మనాభుడు
ఆంజనేయ సహితుడైన కాశీ విశ్వేశ్వరుడు
కలరిక్కడ కలవిచ్చట సుబ్రహ్మన్యేశ్వర
సోమేశ్వర,ఉమా మహేశ, దక్షిణేశ్వరాలయాలు ||
నగరేశ్వర, భీమేశ్వర, శ్రీ కేదారేశ్వర
ఆలయాలు పరమేశ్వరి ప్రణయేశ్వర నిలయాలు
కలవిక్కడ కలరిచ్చట మహిషాసుర మర్దిని,
బద్ది పోచమ్మ తల్లి బాధితులకు కల్పవల్లి ||
బాల త్రిపుర సుందరిగా, బాల రాజేశ్వరునిగ
బహు రూపుల భాసించే భవ్య తత్త్వమిక్కడ
మహాలక్ష్మి, కనకదుర్గ మహిమాన్వితలిక్కడ
మహిలో వేములవాడకు సరి మరి యింకెక్కడ? ||
డాండర డర డాండర డర డాండర డర డాండ
డాండర డర డాండర డర డాండర డర డాండ
డాండర డర డమరుక ధ్వని కైలాసము నిండ
డాండర డర ప్రతిధ్వనుల జాండములకు నిండ
డాపలి సగభాగపు చెలి దరహాసము పండ
వలపలి సగభాగపు శివతాండవ మటులుండ...
చండికేశ మండితమౌ చిటి తాళము లండ
నందికేశ మోదితమౌ నాద స్వరముండ
డుండిరాజ గణపతి స్వరజతుల ఝరులు పొంగ
గురుగుహ నఖ ముఖరితమౌ శృతి నియతినొసంగ..
వెన్నుని కనుసన్నల కరవేణువు రస వెన్నెల
తలపించగ మానసమున యమునా నది తిన్నెల
మాటలసతి పతి కృత మద్దెలసడి సంధిల్ల
నాట్య వేద నాద ఝరుల మునిగెను జగమెల్ల...
తత్తరికిట ధిత్తరికిట తత్తరికిట తత్తోం
తాం తరికిట తోం తరికిట ధీం తరికిట ధిత్తాం
తాళ గతుల యతుల జతుల పరవశమున చిత్తం
తాండవమది ఆడెను సతి ఆడెను తను పశుపతి...
హరి పాడగ సిరి యాడగ సరస్వతియు పాడగ
తానాడెను ధాత యతనితో గూడెను సుర నేత
ప్రమథ గణములూగెను కైలాస శిఖర మూగెను
జగమూగెను శివుడూగెను ఆతని సరి సగమూగెను...
అంగ భంగిమములు పొంగ హావ భావ సంగతంగ
అంగరంగ వైభవంగ హర నృత్యము సంఘటిల్లి
అడుగడుగున సురసంఘము ప్రణమిల్లగ సంతసిల్లి
శివుడూగెను శిరమున జాబిలి, గంగా శిరమూగెను...
నాద దేహుడైన శివుని కమరె నట్టువాంగం
నర్తన కనువర్తనులౌ అమర నట్టువాంగం
రంగస్థల కాంతులైరి రవి, రజనీ కాంతులు
విశ్వ హృద్య వేదికపై భక్త హృదయ పీఠిక పై ...
Tuesday, October 11, 2011
వేములవాడ
రాజేశ్వర రాచ నగరి వేములవాడ
వేములవాడ
రాజేశ్వర రాచ నగరి వేములవాడ
రావణారి శ్రీరాముని నిలయం కూడా ||
శివ భక్తుడు శ్రీ రాముడు రామ భక్తుడైన శివుడు
శివ భక్తుడు శ్రీ రాముడు రామ భక్తుడైన శివుడు
కొలువిక్కడ దీర్చినారు కొలిచిన దరి జేర్చు వారు ||
కొలువిక్కడ దీర్చినారు కొలిచిన దరి జేర్చు వారు ||
ఎడమచేత విల్లు, వింటి పక్కన ఒక హరివిల్లు,
హరుని విల్లు విరిచిన హరి వరియించిన సిరి జల్లు,
గొడుగుగ,ఒక పడకగ,అడవులకు తోడు నడకగా
నడిచిన తమ్ముడు నిలిచిరి శ్రీ రాముని కిరుపక్కల ||
కుదురుగ తనకెదురుగ తన దాసజనుల గురుతుగ
కుదురుగ తనకెదురుగ తన దాసజనుల గురుతుగ
ఆంజనేయుడై కొలిచిన ఆది పరమ శివుడట
తమ్ముడితో, అమ్మడితో, కరముల విల్లమ్ములతో
అంజలితో హనుమతో అయోధ్య విభుని కొలువిట ||
Monday, October 10, 2011
Sunday, October 9, 2011
Wednesday, October 5, 2011
Monday, October 3, 2011
Sunday, October 2, 2011
వేములవాడ
భోళా దేవుడవయ్యా బ్రోతువు జగము శివయ్యా
కేళీ తాండవ లీలా వినోది గౌరీ పతి దయ గనవయ్యా
పాహి పాహి అని అంటే చాలు పరమ దయానిధి పార్వతీ పతీ
పశువుల నైనా,శిశువులనైనా, పాములనైనా,పురుగులనైనా
పరుగు పరుగునా పరదైవతమా
చేరదీయుటే నీదగు రీతి ||భోళా ||
నీ భక్తులకై అశేష భోగంనీ కొరకై నిర్విరామ యోగం
ఇంద్ర పదవులూ నీ అనుగ్రహం నీకు శ్మశానపు వాటికే గృహం
అమృతము నొదిలీ హాలాహలమా?పరునకు సిరినిడ కోలాహలమా?
నీకు తగ్గదే నీ ఇల్లాలు మీ దాసులమని అంటే చాలు ||భోళా||
అద్వంద్వ భవ ధ్వాంత ధ్వంస నిర్మల మానస సరసీ హంస
మన్మధుడిని మసి చేసి మాయతో పంచుకోని తనువున సమభాగం
మంచు కొండపై మరుభూములలోమాయా మయమది నీ సంసారం
దాంపత్యానికి కామం కన్నా ప్రేమ మిన్నయని ఆ ఘన సారం ||భోళా||
సీతాసతి శ్రీరామచంద్రుడు,శ్రీసతి శ్రీపతి,వాణీ భవులు
ఆదిమిధునములు అందరందరే ఐనా మీ సరి పోలరిందరు
అనురాగానికి అన్యోన్యతకు ఆలూ మగలకు శివ పార్వతులే
ఆదర్శమనే ఆ చెరిసగమై నీ శిశువులతో నిండిన జగమై ||భోళా||

నాద దేహుడైన శివుని నిత్య నృత్య క్రీడా
వేదికైన వేద భూమి వేములవాడ
వేదికైన వేద భూమి వేములవాడ
రాజేశ్వరుడిచట వెలసె శ్రీహరి వేడ,
భక్త జనుల కొరకై రాజేశ్వరితో కూడి యాడ ||నాద||
భక్త జనుల కొరకై రాజేశ్వరితో కూడి యాడ ||నాద||
ముక్తి పదవి శ్రీ శైలం శిఖరము జూడ
గంగను గని కాశి లోన ఈ తనువును వీడ
నోరారా వేములవాడ యని పలికిన కూడా
యని పొగిడెను దీని మహిమ దేవగురుడు కూడ ||నాద||
గంగను గని కాశి లోన ఈ తనువును వీడ
నోరారా వేములవాడ యని పలికిన కూడా
యని పొగిడెను దీని మహిమ దేవగురుడు కూడ ||నాద||
వృత్రుని వధియించి బ్రహ్మ హత్య పాప పీడ
పొంది ఇంద్రుడార్తి తోడ బృహస్పతిని వేడ
సురగంగా సమమని పుష్కరిణిని కొనియాడ
స్నాన మిచట జేసె,బాసె ఆ పాపపు జాడ ||నాద||
పొంది ఇంద్రుడార్తి తోడ బృహస్పతిని వేడ
సురగంగా సమమని పుష్కరిణిని కొనియాడ
స్నాన మిచట జేసె,బాసె ఆ పాపపు జాడ ||నాద||
సురసంఘము యాగముకై గంధమాదనమున కూడె
సురవిజయముకై దక్షుని యాగము కొనసాగు నాడె
హవిస్సులపహరించె సోమకాసురుడనువాడే
వారింపగ సూర్యుడతని జేరి పెనగులాడె ||నాద||
సురవిజయముకై దక్షుని యాగము కొనసాగు నాడె
హవిస్సులపహరించె సోమకాసురుడనువాడే
వారింపగ సూర్యుడతని జేరి పెనగులాడె ||నాద||
సూర్యుని చేతులపై హవిస్సు చింది చేతులూడె
తన చేతులకొరకై రవి శివునిచ్చట వేడె
పొందిన తన కరములు జోడించి శివుని గొనియాడె
సూర్య క్షేత్రమని దీనికి నామమునిడి భవుడు వీడె ||నాద||
తన చేతులకొరకై రవి శివునిచ్చట వేడె
పొందిన తన కరములు జోడించి శివుని గొనియాడె
సూర్య క్షేత్రమని దీనికి నామమునిడి భవుడు వీడె ||నాద||
మహిషాసుర పీడనతో జగములు గజ గజ లాడె
సురలు తనను శరణు వేడ, ఆ శక్తి, యభవుని చేడె
శరణని, హరి వారిని గొని చేరెను ఈ పుణ్య పురిని
చూసిరిచట శివానంద సౌందర్య లహరిని ||నాద||
సురలు తనను శరణు వేడ, ఆ శక్తి, యభవుని చేడె
శరణని, హరి వారిని గొని చేరెను ఈ పుణ్య పురిని
చూసిరిచట శివానంద సౌందర్య లహరిని ||నాద||
శివుని ఫాలనేత్ర జ్వాల, శ్రీ హరిదౌ క్రోధలీల
అఖిల దేవతల ఆగ్రహ హేలానల కీలలిచట
ప్రభవించెను ప్రళయకాల, ప్రణవమూల శక్తిగా
నిఖిల దేవతల, హరి, హర శక్తులొకే శక్తిగా ||నాద||
అఖిల దేవతల ఆగ్రహ హేలానల కీలలిచట
ప్రభవించెను ప్రళయకాల, ప్రణవమూల శక్తిగా
నిఖిల దేవతల, హరి, హర శక్తులొకే శక్తిగా ||నాద||
వెలసెనిచట మహిషనాశి,పరమేశ్వరు ప్రణయ రాశి
ధర్మకుండమాయె గంగ,ఈ క్షేత్రము అపర కాశి
ఉమా శివుల సేవకిచట శ్రీహరి నిలిచెను ఇదే
శివ, కేశవ నిలయము కైలాసము, వైకుంఠము ||నాద||
ధర్మకుండమాయె గంగ,ఈ క్షేత్రము అపర కాశి
ఉమా శివుల సేవకిచట శ్రీహరి నిలిచెను ఇదే
శివ, కేశవ నిలయము కైలాసము, వైకుంఠము ||నాద||
మాండవ్యుని,అగస్త్యుని,సనక, సనందన మునుల,
శ్రీ రాముని సేవలంది, ధర్మరాజు పూజలంది,
రాజరాజ నరేంద్ర, సారంగధరుల కనికరించి
అనురక్తిగ భక్తులకు భుక్తి,శక్తి,ముక్తి నిడే ||నాద||
క్షేత్ర పాలకుడు దయార్ద్రు డైన వీరభద్రుడు
శ్రీ రాముని సేవలంది, ధర్మరాజు పూజలంది,
రాజరాజ నరేంద్ర, సారంగధరుల కనికరించి
అనురక్తిగ భక్తులకు భుక్తి,శక్తి,ముక్తి నిడే ||నాద||
క్షేత్ర పాలకుడు దయార్ద్రు డైన వీరభద్రుడు
శివభక్తుల శత్రువులకు ప్రళయ కాల రుద్రుడు
యుగ యుగాల వెలుగు చరిత గలది వేములవాడ
యుగ యుగాల వెలుగు చరిత గలది వేములవాడ
సగసగాల సదాశివ శివానీసరసపు జాడ||నాద||

వేములవాడ
శ్రీ రాజ రాజేశ్వరా! వేములవాడ పురాధీశ్వరా!
నీ చరణములే మాకు శరణములు
నీ స్మరణములే భవ తరణములు
రాజీవాక్ష రాజేశ్వరీ ప్రణయ పీఠేశ్వరా!అమృత మాహేశ్వరా!||శ్రీ||
నీ చరణములే మాకు శరణములు
నీ స్మరణములే భవ తరణములు
రాజీవాక్ష రాజేశ్వరీ ప్రణయ పీఠేశ్వరా!అమృత మాహేశ్వరా!||శ్రీ||
నీ దర్శనమే పాప భంజనం
నీ భక్తులకే హృదయ రంజనం
దయగనరా భవభయములు బాప హరిహర రూపా గిరివర చాపా
జగదీశ్వరా గిరిజహృదయేశ్వరా అర్ధనారీశ్వరా రుద్ర పరమేశ్వరా ||శ్రీ||
నీ భక్తులకే హృదయ రంజనం
దయగనరా భవభయములు బాప హరిహర రూపా గిరివర చాపా
జగదీశ్వరా గిరిజహృదయేశ్వరా అర్ధనారీశ్వరా రుద్ర పరమేశ్వరా ||శ్రీ||
దివిజాధిపతిని , వాణీపతిని
సిరికాంతుడిని , ఏకాంతుడిని
ఎల్లరినొకటిగ కరుణింతువయా కరుణాశంకర,భోళా శంకర
హరహర శంకర అఘనాశంకర పరమశుభంకర భక్త కింకర ||శ్రీ||

ప్రథమ మిధునమౌ ఆదిదంపతులు
మీ గానములే నిజము సంపదలు
కైలాసపురి వాస కల్మష నాశా!అహివర భూషా!ఇహ పర శాసా!
యోగేశ్వరా, యోగి హృదయేశ్వరా,యోగ మాయేశ్వరా,ధర్మకుండేశ్వరా ! ||శ్రీ||
మీ గానములే నిజము సంపదలు
కైలాసపురి వాస కల్మష నాశా!అహివర భూషా!ఇహ పర శాసా!
యోగేశ్వరా, యోగి హృదయేశ్వరా,యోగ మాయేశ్వరా,ధర్మకుండేశ్వరా ! ||శ్రీ||

వేములవాడ
శివ కేశవ నిలయమైన సిరి వేములవాడ
హరి హరులకు అభేదమన్నది వేదం కూడా ||
శివ కేశవ నిలయమైన సిరి వేములవాడ
హరి హరులకు అభేదమన్నది వేదం కూడా ||
హరి హరులకు అభేదమన్నది వేదం కూడా ||
జయ జయ శివ జయ జయ శివ జయహో జయ ఉమాపతీ
జయ కేశవ జయ కేశవ కేశవ జయ రమాపతీ ||
శివ కేశవులనే రెండు మహా కల్ప వృక్షములు
దరి జేరిన వారికిడును అదే మోక్షఫలమును
వా'సు'దేవుడన్నా, వా'మ'దేవుడన్నా
'సుమ'భేదం పేరుకె పూజకు సుమములు ఫలమొకటె ||
శివ శివ శివ శివ శివ యని శ్రీ రామ చంద్రుడు
శివుని పూజ చేశెనిచట సకలసుగుణ సాంద్రుడు
రామ రామ యనుచు శివుడు రామనామ తారకం
జపియించును రామనామ మనే మోక్ష కారకం ||
దుష్ట దైత్య నిర్జనకై వీర విజయ గర్జనకై
తమో శక్తి కొరకు కొలచు ఉమాపతిని రాముడు
తనలోని తమోగుణమును నిగ్రహించుకొనుట కొరకు
సాత్త్వికగుణ మూర్తియైన రామసాధకుడు సోముడు ||
రాజేశ్వర రాజ నగరి వేములవాడ
రమ్యమైన వేదాంత రహస్య ముడులు వీడ
ఎవనికొక్కరే యగుదురు శ్రీ రాముడు సోముడు
వాడొకడే ఈ భువిని అవాప్త సర్వ కాముడు ||

సర్వ దేవతా నిలయం వేములవాడ
సర్వ ధర్మ ముల చల్లని తరువుల నీడ ||సర్వ దేవతా నిలయం వేములవాడ
శ్రీ కాంతుని, శ్రీ కంఠుని స్త్రీల శ్రీ ప్రద వ్రీడ
శివ, పార్వతి,శ్రీ, విష్ణుల సరసమైన రస క్రీడ||
కలువల కాంతులను గెల్చు కాలనేత్రు డొకవంక
నలువను గన్నయ్య నాలి నటనల సడులొకవంక
పెనిమిటినే విషము గొనుటకంపిన ఉమ అటువైపు
వగల మాయదారి నటుని వలచిన రమ ఇటువైపు||సర్వ||
నలువను గన్నయ్య నాలి నటనల సడులొకవంక
పెనిమిటినే విషము గొనుటకంపిన ఉమ అటువైపు
వగల మాయదారి నటుని వలచిన రమ ఇటువైపు||సర్వ||
దక్ష యజ్ఞ నాశకుడా వీరభద్రు డొక వైపు
రాక్షసాంతకుడు దశరధ రామ భద్రుడొక వైపు
ఆ పక్కన దర్గా ఈ పక్క కనక దుర్గ
లేనిది ఏ భేదం ఏ వర్గమిదే స్వర్గం ||
రాక్షసాంతకుడు దశరధ రామ భద్రుడొక వైపు
ఆ పక్కన దర్గా ఈ పక్క కనక దుర్గ
లేనిది ఏ భేదం ఏ వర్గమిదే స్వర్గం ||
కడలిని జేరేవరకే నదుల వివిధ నామములు
కలసినచో కానరావు నామ,రూప భేదములు
చివరికి మిగిలేదొక గంభీర, ధీర సాగరం
అద్వితీయ అనాద్యంత పరమ పురుష సాగరం ||
కలసినచో కానరావు నామ,రూప భేదములు
చివరికి మిగిలేదొక గంభీర, ధీర సాగరం
అద్వితీయ అనాద్యంత పరమ పురుష సాగరం ||
కాలపురుష కడలికివే కల వనేక నామములు
శివ,కేశవ.సూర్య,శక్తి,గణపతి,శరవ ణ భక్తి
దారులెన్ని వున్నా గమ్యమొక్కటే రస రమ్య మొక్కటే ననే
సత్య శోధనా విశేష మర్మ మొక్కటే పర ధర్మమొక్కటే ననే ||
శివ,కేశవ.సూర్య,శక్తి,గణపతి,శరవ
దారులెన్ని వున్నా గమ్యమొక్కటే రస రమ్య మొక్కటే ననే
సత్య శోధనా విశేష మర్మ మొక్కటే పర ధర్మమొక్కటే ననే ||
Subscribe to:
Posts (Atom)