मने चाकर राखो जी
मने चाकर राखो जी
मने चाकर राखो जी||
मने चाकर राखो जी
मने चाकर राखो जी||
चाकर रहसूं बाग लगासूं
नित उठ दरसन पासूं
वृन्दावन की कुन्ज गलिन में
तेरी लीला गासूं ||
चाकर रहसूं बाग लगासूं
नित उठ दरसन पासूं
वृन्दावन की कुन्ज गलिन में
तेरी लीला गासूं ||
नित उठ दरसन पासूं
वृन्दावन की कुन्ज गलिन में
तेरी लीला गासूं ||
मने चाकर राखो जी||
चाकरी में दर्शण पाऊं
सुमरण पाऊं खरची
भाव भगत जागीरी पाऊं
तीन बात सरसी ||
सुमरण पाऊं खरची
भाव भगत जागीरी पाऊं
तीन बात सरसी ||
मने चाकर राखो जी||
मोर मुकुट पीताम्बर सोहे
गल बैजन्ती माला
वृन्दावन में धेनु चुरावे
मोहन मुरली वाला ||
गल बैजन्ती माला
वृन्दावन में धेनु चुरावे
मोहन मुरली वाला ||
मने चाकर राखो जी||
हरे हरे नित बन्न बनाऊं
विच विच राखूं क्यारी
सांवरियाके दर्शण पाऊं
पहर कुसुम्भी सारी||
विच विच राखूं क्यारी
सांवरियाके दर्शण पाऊं
पहर कुसुम्भी सारी||
मने चाकर राखो जी||
जोगी आया जोग कराण कूं
तप करने संन्यासी
हरिभजन कूं साधू आयो
वृन्दावन के बासी||
तप करने संन्यासी
हरिभजन कूं साधू आयो
वृन्दावन के बासी||
मने चाकर राखो जी||
मीरा के प्रभु गहिर गम्भीरा
सदा रहो जी धीरा
आधी रात प्रभु दर्शण दैहें
प्रेम नदी के तीरा||
सदा रहो जी धीरा
आधी रात प्रभु दर्शण दैहें
प्रेम नदी के तीरा||
मने चाकर राखो जी||
నా మది సదనము మదన జనకుడా
నీవిది అదను కాదనకు రసికుడా||నా మది||
నీవిది అదను కాదనకు రసికుడా||నా మది||
మది నీ సదనము మధువన యుతము
పదపడి నీదగు దర్శన హితము
మది మధువాడల చేయుట నిరతము
నీదగు గాధను గాన మభిమతము||నామది||
పదపడి నీదగు దర్శన హితము
మది మధువాడల చేయుట నిరతము
నీదగు గాధను గాన మభిమతము||నామది||
మన్మందిరమున దర్శన మొనరించి
సంస్మరించెదను సాహసమున మించి
నీ పదముల భక్తి సామ్రాజ్యము గొందు
నా మృదు సరస సంభాషణలిడి విందు||నా మది||
సంస్మరించెదను సాహసమున మించి
నీ పదముల భక్తి సామ్రాజ్యము గొందు
నా మృదు సరస సంభాషణలిడి విందు||నా మది||
సిగను పింఛము, పీతాంబరము
వైజయంతి యుత నీలాంబరము
గోవుల నెపమిడి దొంగ సంబరము
లావుగ యా వేణుగానము రసభరము||నా మది||
వైజయంతి యుత నీలాంబరము
గోవుల నెపమిడి దొంగ సంబరము
లావుగ యా వేణుగానము రసభరము||నా మది||
హరిత మయము మనోహరము వనము
హరిమయము విరహభరము నా మనము
మురిసిపోదు హరి దర్శన మొనరించి
మెరిసిపోవు ఘన చేలము ధరియించి||నామది||
హరిమయము విరహభరము నా మనము
మురిసిపోదు హరి దర్శన మొనరించి
మెరిసిపోవు ఘన చేలము ధరియించి||నామది||
యోగులు అరుదెంచి యోగమును వహించి
తపమొనరింతురు తాము తరింతురు
హరిభజనకునై గాయకులరుదెంచి
కురిపింతురు గానసుధలు రహిమించి||నా మది||
తపమొనరింతురు తాము తరింతురు
హరిభజనకునై గాయకులరుదెంచి
కురిపింతురు గానసుధలు రహిమించి||నా మది||
'మీరా'వరుడు జలధిగంభీరుడు
మేటి మురారి మేరుధీరుడు
రాతిరి తను నాకు దర్శనమిడెను
యమున తీరమున తారసపడెను||నా మది||
మేటి మురారి మేరుధీరుడు
రాతిరి తను నాకు దర్శనమిడెను
యమున తీరమున తారసపడెను||నా మది||
No comments:
Post a Comment