పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

వేములవాడ


శివ కేశవ నిలయమైన సిరి వేములవాడ
హరి హరులకు అభేదమన్నది వేదం కూడా   ||
జయ జయ శివ జయ జయ శివ జయహో జయ ఉమాపతీ
జయ కేశవ జయ కేశవ కేశవ జయ రమాపతీ  ||

శివ కేశవులనే రెండు మహా కల్ప వృక్షములు
దరి జేరిన వారికిడును అదే మోక్షఫలమును
వా'సు'దేవుడన్నా, వా'మ'దేవుడన్నా
'సుమ'భేదం పేరుకె పూజకు సుమములు ఫలమొకటె  ||

శివ శివ శివ శివ శివ యని శ్రీ రామ చంద్రుడు
శివుని పూజ చేశెనిచట సకలసుగుణ సాంద్రుడు
రామ రామ యనుచు శివుడు రామనామ తారకం
జపియించును రామనామ మనే మోక్ష కారకం  ||

దుష్ట దైత్య నిర్జనకై వీర విజయ గర్జనకై
తమో శక్తి కొరకు కొలచు ఉమాపతిని రాముడు
తనలోని తమోగుణమును నిగ్రహించుకొనుట కొరకు
సాత్త్వికగుణ మూర్తియైన రామసాధకుడు సోముడు  ||

రాజేశ్వర రాజ నగరి వేములవాడ
రమ్యమైన వేదాంత రహస్య ముడులు వీడ
ఎవనికొక్కరే యగుదురు శ్రీ రాముడు సోముడు
వాడొకడే ఈ భువిని అవాప్త సర్వ కాముడు  ||




No comments:

Post a Comment