పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 16, 2011


సత్యం!



ఎవరూ విననిది,అన్నీ వినునది
ఎవరూ కననిది,అన్నీ కనునది
ఎవరనరానిది,అన్నిటి ననునది
ఎవ్వరికైనా స్పృశింపరానిది,నశించి పోనిది
వాసము లేనిది,'వాసన' లేనిది,
అన్నిట 'తానై',అన్నిట 'నేనై',
శూన్యపు మేనై,మాయల జాణౌ
నదే భవిష్యం ,అదే రహస్యం
వర్తమానమది,గతమయ్యదియే
తీసివేతలో తీసిపోనిది,వడపోతలలో తేలిపోనిది,
ఏకతమున ఏకాంత సీమలకు
తరలువారిటకు మరలిరాని
ఘన సన్నిధానమది, పెన్నిధానమది!
గంతా, మంతా, అంతా తానై,
కర్తా, భర్తా, హర్తా తానై
నర్తన, మాయల వర్తన జేసే
వేద నాదమది, విధి విధానమిది!
దానికి లేదే కులమూ, మతమూ!
కాదే జాతీ అహితము, హితమూ!
ఆతండొకడే సత్యుడు, ఎరిగిన వాడే నిత్యుడు!










No comments:

Post a Comment