పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

వేములవాడ


భోళా దేవుడవయ్యా బ్రోతువు జగము శివయ్యా
కేళీ తాండవ లీలా వినోది గౌరీ పతి దయ గనవయ్యా

పాహి పాహి అని అంటే చాలు పరమ దయానిధి పార్వతీ పతీ
పశువుల నైనా,శిశువులనైనా, పాములనైనా,పురుగులనైనా
పరుగు పరుగునా పరదైవతమా
చేరదీయుటే నీదగు రీతి                                ||భోళా ||

నీ భక్తులకై అశేష భోగంనీ కొరకై నిర్విరామ యోగం
ఇంద్ర పదవులూ నీ అనుగ్రహం నీకు శ్మశానపు వాటికే గృహం
అమృతము నొదిలీ హాలాహలమా?పరునకు సిరినిడ కోలాహలమా?
నీకు తగ్గదే నీ ఇల్లాలు మీ దాసులమని అంటే చాలు ||భోళా||

అద్వంద్వ భవ ధ్వాంత ధ్వంస నిర్మల మానస సరసీ హంస
మన్మధుడిని మసి చేసి మాయతో పంచుకోని తనువున సమభాగం
మంచు కొండపై మరుభూములలోమాయా మయమది నీ సంసారం
దాంపత్యానికి కామం కన్నా ప్రేమ మిన్నయని ఆ ఘన సారం ||భోళా||

సీతాసతి శ్రీరామచంద్రుడు,శ్రీసతి శ్రీపతి,వాణీ భవులు
ఆదిమిధునములు అందరందరే ఐనా మీ సరి పోలరిందరు
అనురాగానికి అన్యోన్యతకు ఆలూ మగలకు శివ పార్వతులే
ఆదర్శమనే ఆ చెరిసగమై నీ శిశువులతో నిండిన జగమై ||భోళా||


No comments:

Post a Comment