పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Sunday, October 2, 2011

వేములవాడ


సర్వ దేవతా నిలయం వేములవాడ 
సర్వ ధర్మ ముల చల్లని తరువుల నీడ ||


శ్రీ కాంతుని, శ్రీ కంఠుని స్త్రీల శ్రీ ప్రద వ్రీడ 
శివ, పార్వతి,శ్రీ, విష్ణుల సరసమైన రస క్రీడ||
కలువల కాంతులను గెల్చు కాలనేత్రు డొకవంక
నలువను గన్నయ్య నాలి నటనల సడులొకవంక
పెనిమిటినే విషము గొనుటకంపిన ఉమ అటువైపు
వగల మాయదారి నటుని వలచిన రమ ఇటువైపు||సర్వ||
దక్ష యజ్ఞ నాశకుడా వీరభద్రు డొక వైపు
రాక్షసాంతకుడు దశరధ రామ భద్రుడొక వైపు
ఆ పక్కన దర్గా ఈ పక్క కనక దుర్గ
లేనిది ఏ భేదం ఏ వర్గమిదే స్వర్గం          ||
కడలిని జేరేవరకే నదుల వివిధ నామములు
కలసినచో కానరావు నామ,రూప భేదములు
చివరికి మిగిలేదొక గంభీర, ధీర సాగరం
అద్వితీయ అనాద్యంత పరమ పురుష సాగరం   ||
కాలపురుష కడలికివే కల వనేక నామములు
శివ,కేశవ.సూర్య,శక్తి,గణపతి,శరవణ భక్తి
దారులెన్ని వున్నా గమ్యమొక్కటే రస రమ్య మొక్కటే ననే
సత్య శోధనా విశేష మర్మ మొక్కటే పర ధర్మమొక్కటే ననే |
|




No comments:

Post a Comment