పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Wednesday, October 12, 2011























 వేములవాడ




అఖిల దేవతల నిలయం అడుగడుగున ఆలయం
ఆధ్యాత్మికతకు నిలయం వేములవాడ

వేదాంతుల వేగుచుక్క వేములవాడ  
దాంతుల ఏకాంతుల స్వాంతాలకు ఇది నీడ ||

రాజేశ్వర తరంగిణి ధర్మకుండ పుష్కరిణి 
రాజతీర్ధమైన దిదే సురగంగా  తరంగిణి 
ఇచట  స్నానమాచరించి అర్ఘ్యములను  సమర్పించి
ధర్మ రూపమైన వృషభ వాహనమర్పింతు రిచట||

దక్షిణాన దక్షయజ్ఞ నాశి వీరభద్రుని,
దర్శించెదరా  చెంతనె రంగుమీరు లింగ కోటి 
సేవించెదరా పొంతనె శేషశాయి విఠలుని 
చేతురు ప్రార్ధన నియతిని చండీశుని అనుమతిని ||

లక్ష్మీ గణపతిని జూసి నందీశ్వర సేవ జేసి
శృంగ మధ్యమందు దృష్టి నిలిపి లింగరూపు జూసి 
కొలుతురు రాజేశ్వరుని పంచమి రాజేశ్వరిని 
మూడు మొనల జోదువుని మూలపు ముత్తైదువుని  ||

ఆది దేవుడైన ఆ అనంత పద్మనాభుడు
ఆంజనేయ  సహితుడైన కాశీ విశ్వేశ్వరుడు
కలరిక్కడ కలవిచ్చట సుబ్రహ్మన్యేశ్వర  
సోమేశ్వర,ఉమా మహేశ, దక్షిణేశ్వరాలయాలు ||

నగరేశ్వర,  భీమేశ్వర, శ్రీ కేదారేశ్వర
ఆలయాలు పరమేశ్వరి ప్రణయేశ్వర నిలయాలు   
కలవిక్కడ కలరిచ్చట మహిషాసుర మర్దిని,
బద్ది పోచమ్మ తల్లి బాధితులకు కల్పవల్లి ||

బాల త్రిపుర సుందరిగా, బాల రాజేశ్వరునిగ 
బహు రూపుల భాసించే  భవ్య తత్త్వమిక్కడ
మహాలక్ష్మి, కనకదుర్గ మహిమాన్వితలిక్కడ 
మహిలో వేములవాడకు సరి మరి యింకెక్కడ? || 

No comments:

Post a Comment