పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Saturday, October 22, 2011

విశాల విశ్వం నా ఇల్లు..
















విశాల విశ్వం నా ఇల్లు!
విరియును మమతల హరి విల్లు!
రాదిక ఖేదం,కాదిక వాదం,
లేదిక తర తమ వర్గ విభేదం!
లేదిక తర తమ వర్గ విభేదం!
గతించిపోయిన వైభవాలను
హరించి పోయిన కేదారాలను
తలంచుకుంటూ ,స్మరించుకొంటూ,
తలొంచుకొంటూ,భరించుకొంటూ,
రగిలే పొగిలే సమయం కాదిది!
రగిలే పొగిలే సమయం కాదిది!
గతం హయానికి కళ్ళెం వేసి
సవాలు చేద్దాం,సవారి చేద్దాం!
భావి భయానికి బల్లెం దూసి,
అన్ని దిక్కులా మనం చరిద్దాం!
సర్వ శత్రువుల మనం హరిద్దాం!
సర్వ ప్రపంచం విస్మయ విచలిత
ముకుళిత హస్తాల్ అంజలింపగా!
నయన వినిర్గత జ్వాల కీలికల
భారతి హాసం ప్రజ్జ్వలింపగా
విశాల విశ్వ విపంచిపైన ఇక
మమతల తంత్రులు మీటేద్దాం!
సమతల సంధులు చాటిద్దాం!
నువ్వూ,నేనూ,ఆమె..'మనమై'
పువ్వూ,తేనే,ప్రేమల వనమై,
కదలి సాగుదాం కదం తొక్కుతూ!
కలిసి సాగుదాం పదం పాడుతూ!!


(రచనా కాలం 1987...)

No comments:

Post a Comment